పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు..

నవతెలంగాణ- రెంజల్

రెంజల్ మండలంలోని కోనేపల్లి క్రాస్ రోడ్డు నుంచి, బాగేపల్లి వరకు రోడ్డుకి ప్రక్కల పచ్చని చెట్లు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. గత పది సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం లో భాగంగా ఏర్పాటు చేసిన మొక్కలు నేడు మహావృక్షాలై రెండు గ్రామాల మధ్యన ఆహ్లాద వాతావరణ అన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల ఈ గ్రామాలను జేసీ సందర్శించి, సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా కూనేపల్లి గ్రామానికి అవార్డు కూడా రావడం విశేషం. అక్కడక్కడ కరెంటు వైర్లు చెట్ల పైకి రావడంతో విద్యుత్ శాఖ సిబ్బంది వాటిని తొలగిస్తున్నప్పటికీ రోడ్డుకి ప్రక్కల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తున్నాయి.