సిటికాలేజ్‌లో గ్రూప్‌-4 ఆఫ్‌లైన్‌ కోచింగ్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌లోని సిటీకాలేజ్‌లో గ్రూప్‌-4 ఆఫ్‌లైన్‌ కోచింగ్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభిస్తున్నట్టు టీఎస్‌బీసీ స్టడీసర్కిల్స్‌ డైరెక్టర్‌ కే అలోక్‌కుమార్‌ తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, డిగ్రీలో ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణులైన అబ్యర్ధులు అర్హులనీ, ఈనెల 31లోపు తమ దరఖాస్తుల్ని నేరుగా సమర్పించాలని కోరారు. మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుందనీ, తల్లిదండ్రులకు సంవత్సరానికి రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండాలన్నారు. క్లాసులు ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. దరఖాస్తుల్ని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 040-27077929, 040-24071178 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలి.