హామీలు అమలు చేయాలి

నవతెలంగాణ-వీణవంక
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.  ఈ మేరకు బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇండ్లు కట్టుకునే వారందరికీ గృహలక్ష్మి, బీసీ బంధు, మైనార్టీ బంధు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.