గో సంరక్షకుడు

– బిట్టూ బజరంగి అరెస్ట్‌
చండీఘడ్‌ : గత నెల 31న హర్యానాలోని నూV్‌ా జిల్లాలో చెలరేగిన మతపరమైన హింసాకాండతో సంబంధమున్నదన్న ఆరోపణపై స్వయం ప్రకటిత గో సంరక్షకుడు, బజరంగ్‌దళ్‌ నాయకుడు బిట్టూ బజరంగి అలియాస్‌ రాజ్‌కుమార్‌ను హర్యానా పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవడం, అవమానించడం, అల్లర్లకు పాల్పడడం, భయపెట్టడం వంటి ఆరోపణలపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద, అలాగే ఆయుధాల చట్టం కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. వీహెచ్‌పీ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా బజరంగి, ఆయన అనుచరులు ఆయుధాలతో స్వైరవిహారం చేశారని, ముస్లింలపై దాడి చేశారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బజరంగి, ఆయన అనుచరులు పోలీసు వాహనం నుండి ఆయుధాలను అపహరించి, అధికారులను బెదిరించారని చెప్పారు. బ్రిజ్‌ మండల్‌ జలాభిషేక్‌ యాత్రను పురస్కరించుకొని బజరంగ్‌దళ్‌, వీహెచ్‌పీ సంస్థలు నూV్‌ాలో నిర్వహించిన ప్రదర్శన సందర్భంగా ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు కూడా హింసాకాండ వ్యాపించింది. ముస్లింల నివాస గృహాలు, దుకాణాలపై మతోన్మాదులు దాడులు జరిపారు. కాగా తాను మీరట్‌ వచ్చానంటూ బజరంగి జూలై 30న అనేక వీడియోలను సామాజిక మాధ్యమాలలో అప్‌లోడ్‌ చేశారు. దీనికి సంబంధించి ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అయితే ఆ తర్వాత బజరంగి బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయనను మంగళవారం పోలీసులు మరోసారి ప్రశ్నించి అరెస్ట్‌ చేశారు.