నవతెలంగాణ- రామారెడ్డి
ఏజెంట్ మోసాలకు గల్ఫ్ కార్మికుడు మృతి చెందిన ఘటన మస్కట్లో గత శనివారం చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెల్లోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని ఉప్పల్వాయి గ్రామానికి చెందిన పురం సిద్ధిరాములు (46), గత ఆరు నెలల క్రితం, ఏజెంట్ ను ఆశ్రయించి మస్కట్ దేశానికి బతుకుదెరువు కోసం వెళ్లగా, ఏజెంటు విజిట్ వీసాపై పంపడంతో, గత ఐదు నెలల 15 రోజులు సప్లై కంపెనీలో పనిచేయగా, 15 రోజుల క్రితం వీసా లేదని, కంపెనీ బయటకు పంపియడంతో, 15 రోజులు రోడ్లపై, పార్కుల్లో, మసీదుల్లో తిడి లేక ఇబ్బందులు పడుతుండడంతో, ఒక్కడి తెలుగువారు సోషల్ మీడియాలో వీడియోతో వివరాలు పంపగా, మస్కట్ లో సదరు ఏజెంట్ గత శుక్రవారం మిత్రుల రూమ్ కు తీసుకెళ్లగా, శనివారం ఉదయం మృతి చెందాడని ఇంటికి గురువారం సమాచారం అందించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏజెంట్ మోసాలకు బలి అయినా గల్ఫ్ కార్మికుని శవాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని బాధిత కుటుంబం కోరారు. మండల గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు బండ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. శవాన్ని త్వరలో ఇంటికి పంపించే ప్రయత్నాలు చేస్తామని, ఏజెంట్ మోసాలను ప్రభుత్వం అరికట్టాలని, గల్ఫ్ వచ్చే కార్మికులు ఏజెంట్ల పట్ల జాగ్రత్త ఉండాలని సూచించారు