బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గుండగోని మైసయ్య గౌడ్

– చండూరు బీజేపీ పట్టణ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్
నవతెలంగాణ – చండూరు: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గుండెగోని మైసయ్య అని మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్ అన్నారు. గుండెగోని మైసయ్య 25 వ వర్ధంతిసందర్భంగా బుధవారం భారత చంద్ర గార్డెన్ లో ఆయన చిత్రపటానికి సత్యం గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేత సమస్యల పరిష్కారం కోసం గట్టుప్పల్ మండలంలోని తేర టు పల్లి గ్రామంలో నక్సల్స్ తూటాకు బలైన మైసయ్య గౌడ్ ను స్మరించుకున్నారు. ఆయన పార్టీకి చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కోమటి వీరేశం, రైతు సేవ సహకార సంఘం డైరెక్టర్ బోడ ఆంజనేయులు , సముద్రాల వెంకటేశ్వర్లు, సుదర్శన్ రెడ్డి, నకరికంటి లింగస్వామి , బొబ్బిలి మనోహర్ రెడ్డి , చెరుపల్లి కృష్ణ , బొబ్బలి శివ, ఇరిగి ఆంజనేయులు, ముమ్మడి వెంకటా చారి, దుస్స గణేష్ , తోకల రవీందర్, కోట జానకి రాములు , రావురాల వెంకటేశం , రవిరాల శ్రీను , కోడి కృష్ణ, కళ్లెట్ల రవి ,చిట్టిప్రోలు వెంకటేశం, పులకరం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.