– 8మంది మృతి, 28మందికి పైగా గాయాలు
వాషింగ్టన్ : అమెరికాలో తుపాకీ సంస్కృతి మళ్లీ బుసలు కొట్టింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రెండు రోజుల్లోనే 8మంది దాకా ఈ తుపాకీ సంస్కృతికి బలయ్యారు. మరో 28మంది దాకా గాయపడ్డారు. వాషింగ్టన్ డిసిలో బుధవారం తెల్లవారు జామున జరిగిన కాల్పుల్లో ఇద్దరు పిల్లలతో సహా 9మంది తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారు జామున ఒంటిగంట ప్రాంతంలో రాజధానిలోని మీడ్ స్ట్రీట్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నవారిపై కారులో వచ్చిన దుండగులు కాల్పులు జరిపి పారిపోయారని అసిస్టెంట్ చీఫ్ పార్సన్స్ తెలిపారు. బాల్టిమోర్‌లో ఆదివారం తెల్లవారు జామున జరిగిన దాడిలో అయిదుగురు చనిపోయారు… టెక్సాస్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మునిగివున్న ప్రజలపై సోమవారం అర్ధరాత్రి సమయంలో పలువురు వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 8మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు.