గుబాళించే గుప్పెడు కథా మల్లెలు

Gubalane Guppedu Katha Malleluగుప్పెడు మల్లెలు
రచయిత : జిల్లేళ్ళ బాలాజీ
పేజీలు : 132, వెల : రూ.150/-
ప్రతులకు : జిల్లేళ్ళ బాలాజీ,
ఇం. నెం. 9-535,
ఓంశక్తి గుడిప్రక్క సందులో
లింగేశ్వర్‌ నగర్‌, బైరాగి పట్టెడ,
తిరుపతి – 517501
సెల్‌ : 9866628639

ఈ కథా సంపుటిని రచయిత తన మేనల్లుళ్ళు చి|| జితేంద్ర, చి|| కేదారనాథ్‌లకు ఆశీస్సులతో అంకితం చేశారు. పిల్లల కోసం ”మేక వన్నె పులులు” అనే హాస్య నాటికనూ 4 పాత్రలతో అందించారు. మొత్తం పాతిక కథలున్నాయి. రచయిత 8వ కథా సంపుటి ఇది. 4 దశాబ్ధాలుగా కథలు రాస్తున్నారు. (1984 నుంచి). డిటెక్టివ్‌ కథ కూడ ఈ సంపుటిలో వుంది. ‘యాచకుడు’ కథ కంటకన్నీరు పెట్టిస్తుంది. కవి ఆదినారాయణ జయంతి సభ జరుగుతూ వుంటుంది. మంత్రి ప్రసంగం జరిగే టైంటో కలి కుమారుడు భిక్షాటన చేస్తున్నానని- ఆదినారాయణ కొడుకును అనడంతో సభ స్తంభిస్తుంది. ఇదే ‘యాచకుడు’ కథాంశం (పేజీ. 7)
ఒక బంగళాలోకి నారాయుడు అనే దొంగ ప్రవేశించి బీరువా తెరచి దోచుకోని బయట అలికిడి విని… గది మంచం కింద దాక్కొంటాడు. ఇంట్లోకి ఆ బంగ్లా యజమాని ప్రవేశించి.. బీరువా తాళాలు తెరచి వుండటంతో ఆనందంగా దానిలోని డబ్బు కర్చీఫ్‌లో మూటకట్టుకొని మనసులో తాళం వేయని భార్య కాంతాన్ని మెచ్చుకొని బీరు సేవించడానికి బార్‌ వైపు వెళ్ళిపోతాడు. తన ఇంట్లో తానే ‘దొంగ’తనం చేసే యజమాని- అతని భార్య స్థితిని – అద్దం పట్టే కథే ”దొంగ”. (పేజీ. 29)
క్రైమ్‌ థ్రిల్లర్‌ కథ ”స్వేచ్ఛ కోసం” చాలా బాగుంది. (పేజీ. 87) కళకు – కళాకారులకు- ముఖ్యంగా సినిమా నటీ నటుల్లో ఉండే కోర్కెల ఫాంటసీపై రాసిన కథ ‘స్పర్శ’ (పేజీ. 125) విశాలి – నీరజ్‌లు ఓ చిత్రంలో కథా నాయకీ – కథా నాయకుడు పాత్రలు ధరించడం – విశాలిని పొందాలనే నీరజ్‌ కోర్కెను తిరస్కరిస్తూ.. తన్ను తాను.. దృఢంగా నిలబడి ఆమె క్యారెక్టర్‌ కాపాడుకొంటుంది. తండ్రి పాత్ర ధారి భానుమూర్తిని విశాలి ఇష్టపడుతుంది. రానున్న రోజుల్లో హీరో నీరజ్‌తో నటించరాదు అని నిర్ణయించుకొని ముందుకెళుతుంది. అన్ని కథలూ పాఠకుల్ని చివరిదాకా చదివిస్తాయి.
అనువాద రచనల్లో సిద్ధహస్తులైన బాలాజీ కలంలోంచి మరిన్ని మంచి కథలు , మానవ విలువలు , కుటుంబ సంబంధాలు తెలిపే కథలో రావాలి అని ఆశిస్తూ..!
– తంగిరాల చక్రవర్తి, 9393804472