గుర్రం నారాయణరెడ్డి సేవలు మరువలేనివి

– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-చౌటుప్పల్‌
గుర్రం నారాయణరెడ్డి ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞానకేంద్రం(ఎస్‌వీకే) మేనేజింగ్‌ కమిటీ సభ్యులు గుర్రం బుచ్చిరెడ్డి తండ్రి నారాయణరెడ్డి మృతదేహాన్ని గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండు మల్కాపురం గ్రామ పరిధిలోని బొర్రోళ్లగూడెంలో సందర్శిం చారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడారు. మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు, జ్యోతి, సాగర్‌, జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్‌, హైదరాబాద్‌ నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, ఎస్‌వీకే సెక్రటరీ ఎస్‌. వినయకుమార్‌, నాయకులు రవి, సోమయ్య, బండారు రవి కుమార్‌, కాడిగల్ల భాస్కర్‌, నవతెలంగాణ సీజీఎం ప్రభాకర్‌, ఐలూ జిల్లా అధ్యక్షులు మామిడి వెంకట్‌రెడ్డి, నాయకులు బూర్గు కృష్ణారెడ్డి, ఎమ్‌డి.పాషా, గంగదేవి సైదులు, బండారు నర్సింహా, కోట రామచంద్రారెడ్డి, బొంతల ఉపేందర్‌రెడ్డి, సంజీవరెడ్డి, కొంతం శ్రీనివాస్‌రెడ్డి, గుండ్ల మహేశ్‌, మంత్రి యాదయ్య తదితరులు నివాళి అర్పించారు.