గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

– నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘటన
– పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
గురుకుల విద్యార్థిని హాస్టల్‌ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. గంధవారిగూడెం పరిధిలోని ఎస్సీ గురుకుల ఇంటర్మీడియట్‌ కాలేజీలో ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని హాస్టల్‌ భవనం పైనుంచి దూకింది. దాంతో తీవ్రంగా గాయపడింది. కాలు విరగడంతోపాటు తలకు గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. దాంతో హాస్టల్‌ సిబ్బంది వెంటనే విద్యార్థినిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ బాలిక చికిత్స పొందుతోంది. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.