
మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరాంరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్.బాబురావు, కె.రామ్‌చరణ్, యు.ఉదయ్‌కుమార్, ఎన్. సంజయ్‌కుమార్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో అర్హత సాధించారన్నారు. అలాగే సెప్టెంబర్ 19,20 తేదిలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గోననున్నట్లు తెలిపారు. పీడీ అరవింద్, పీఈటీ కె.అశోక్‌లను ఆయన అభినందించారు. రానున్న రోజులలో పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఆయన వెంట ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు ఉన్నారు.