– తప్పనిసరి చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : తెలంగాణలోని మరో నాలుగు జిల్లాల్లో బంగారం నగలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బంగారు నగల హాల్‌మార్కింగ్‌కు సంబంధించిన మూడో దశను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా కొత్తగా 55 జిల్లాల్లో ఈ మార్కింగ్‌ను తప్పనిసరి చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 9 జిల్లాలను చేర్చింది. తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో 17, తెలంగాణలో 12 జిల్లాల్లో ఈ నిబంధన అమల్లోకి వచ్చినట్లయ్యింది. ఇప్పటికి రెండు దశలను అమలు చేసిన ప్రభుత్వం తాజాగా మూడో దశలో 16 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 55 కొత్త జిల్లాలను చేర్చింది. తెలంగాణలో ఇది వరకు మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలు మాత్రమే ఈ నిబంధన పరిధిలో ఉండగా.. తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలను చేర్చింది.