నవతెలంగాణ- కంఠేశ్వర్: నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం, ఎల్లమ్మ గుట్టలోని మాదిగ బస్తీలో నవంబర్ 11 న జరిగే మాదిగల విశ్వరూప మహసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అలాగే బస్తి మాదిగ వాసులను కలిసి వర్గీకరణ అవశ్యకత, ప్రస్తుత వర్గీకరణ ఉద్యమం, మంద కృష్ణ మాదిగ నాయకత్వం గురించి, ఎమ్మార్పీఎస్ సాధించిన విజయాల గురించి వివరించడం జరిగింది. వర్గీకరణ లేకుంటే మాదిగలకు భవిష్యత్తు లేదని వివరించడం జరిగింది. నవంబర్ 11 నాడు జరిగే మాదిగల విశ్వరూప మహాసభకు తరలి వస్తామని బస్తి వాసులు తెలియచేయడం జరిగింది. జాతి ప్రజలు అందరు హైదరాబాద్ తరలిరావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ మహాసభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రావడం జరుగుతుంది అని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నవీన్ మాదిగ, వినోద్ మాదిగ, శివరాజ్ మాదిగ బస్తి మాదిగ ప్రజలు పాల్గొన్నారు.