చేయి చేయి కలపాలి..

– చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి..
– కుంభం కీర్తి రెడ్డి..
నవతెలంగాణ- భువనగిరి రూరల్ 
చేయి చేయి కలిపి చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల కుంభం అనిల్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కుంభం కీర్తి రెడ్డి కోరారు. మంగళవారం మండలంలోని అనంతారం, గౌస్ నగర్ గ్రామాలలో కుంభ అనిల్ కుమార్ రెడ్డికి మద్దతుగా ఆయన కూతురు కీర్తి రెడ్డి  ప్రచార నిర్వహించారు. 2018 ఎన్నికలలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారని, భువనగిరి ప్రజల ఆశీర్వదిస్తే, భువనగిరి ఎమ్మెల్యేగా ప్రజల సేవ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాక వెంకటేష్ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షులు గడసందుల కృష్ణ, చేరక మల్లా రెడ్డి, గదశందుల హరీశ్, నాయకులు విట్టల్ వెంకటేష్, ఫకీరు కొండల్ రెడ్డి, శ్రీరాములు , కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.