నార్సింగిల్లో హ్యాండ్‌ బాల్‌ పోటీలుప్రధానోపాధ్యాయుడు విజరుకుమార్‌

నవతెలంగాణ-గండిపేట్‌
విద్యార్థులు నార్సింగి ప్రభుత్వ పాఠశాల్లో నిర్వహిస్తున్న హ్యాండ్‌ బాల్‌ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని హెడ్‌మాస్టర్‌ విజరుకుమార్‌ అన్నారు. శుక్రవారం నార్సింగి జిల్లా పరిషత్‌ ప్రభుత్వ పాఠశాల్లో డీఈఓ అనుమతితో ఈ నెల 31 వరకు విద్యార్థులకు సమ్మర్‌ క్యాంపును ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 6 నుండి ఏడున్నర గంటల వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎక్కడ నిర్వహించని విధంగా నార్సింగి ప్రభుత్వ పాఠశాల్లో సమ్మర్‌ క్యాంప్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్కూల్‌ విద్యార్థులతో పాటు బయటి విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. ఉజ్వల భవిష్యత్‌కు ఎదుగుతున్న విద్యార్థులకు క్రీడలు ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పీఇఓ నిరజా, హాండ్‌ బాల్‌ కోచ్‌ దేవేందర్‌ , విద్యార్థులు పాల్గొన్నారు.