ఉపాధ్యాయులకు ట్యాబ్ ల అందజేత

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలాకు కేటాయించిన ట్యాబ్ లను శుక్రవారం మండల వనరుల కార్యాలయంలో ఎంఈఓ దేశిరెడ్డి ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ హుస్నాబాద్ మండలంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక19, ప్రాధమికోన్నత పాఠశాల 3లకు ప్రభుత్వం సామ్ సాంగ్ ట్యాబులను కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బండారి మనీలా, రాజబహదూర్ తదితరులు పాల్గొన్నారు.