హన్మంత్ పటేల్ గుండేపోటుతో ఆకస్మిక మృతి

నవతెలంగాణ – జుక్కల్: మండలంలోని బిజ్దల్ వాడి గ్రామ ఉపాదీ హమి క్షేత్ర సహయకుడు డొంగ్లే హన్మంత్ పటేల్ శుక్రవారం ఉదయం సుమారుగా 11:30 ప్రాంతంలో గుండే పోటుతో  అకస్మీకంగా మరణించారని గ్రామ సర్పంచ్ గౌళే యాదవ్, మండల ఫీల్డ్ అసిస్టెంట్ లు తెలిపారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతు శుక్ర వారం నాడు ఉదయం చాతీలో నొప్పి తీవ్రంగా వస్తుందని కుటింబికులకు  తెలపడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలుస్తున్న క్రమంలో  మార్గమద్యలో  చనిపోవడం  జర్గిందని పేర్కోన్నారు. అదేవిధంగా  ఉపాదీహమీ పథకం ప్రారంబం నుండి గ్రామములో ఎఫ్ఏగా పనిచేస్తు గ్రామములో అందరికి పేదలకు చేదోడు వాదోడుగా ఉంటు ప్రభూత్వ పథకాలను ప్రజలకు అందేవిధంగా కృషిచేస్తు, అపదలో ఉన్నవారికి  ఆర్థికంగా ఆదుకునేవారని,   గ్రామస్తులకు కలిసి మెలిసి ఉండేవాడని  తెలిపారు. ఎఫ్ఏ హన్మంత్ పటేల్ లేని లోటు గ్రామస్తులు జీర్ణించుకోలేక బోరున విలపిస్తు కుటింబికులకు తామున్నామని బరోసా కల్పిస్తున్నారు. ప్రముఖ నాయకులు, మండలంలోని పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు నివాళ్లు అర్పించి సానుభూతిని వ్యక్తం చేసారు.