– కాంగ్రెస్కు పట్టం కట్టిన జుక్కల్ ప్రజలు

– 1152 స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావు
ననవతెలంగాణ- మద్నూర్: గత 15 సంవత్సరాలుగా ముచ్చటగా మూడుసార్లు హ్యాట్రిక్ సాధిస్తూ విషయాల పరంపర లో కొనసాగుతూ వస్తున్న హనుమంతు షిండే గెలుపుకు అడ్డుకట్ట వేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జుక్కల్ ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు. ఓరా ఓరిగా సాగిన ఎన్నికల లెక్కింపులో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే 13 రౌండ్లు ఓట్ల లెక్కింపు అయ్యేవరకు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పై ఆదిత్యంలో కొనసాగారు. 14వ రౌండ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓట్ల లెక్కింపులో ఆదిత్యం సాధిస్తూ చివరగా 1152 స్వల్ప ఓట్ల మెజార్టీతో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి హనుమంతు షిండే పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటా లక్ష్మి కాంతారావు విజయం సాధించారు. ఈసారి జరిగిన జుక్కల్ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ కొనసాగిందని జుక్కల్ ప్రజల్లో జోరుగా చర్చలు వినిపించాయి గెలుపు ఎవరిది అనే దానిపై ఉత్కంఠగా చెప్పలేని పరిస్థితిలో ఓట్ల లెక్కింపు వరకు ప్రజలు బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్ బీజేపీ మూడు పార్టీల్లో ఎవరు గెలుస్తారు అనేది అంచనాలు వెయ్యలేని పరిస్థితి మూడు పార్టీల నాయకుల్లో నెలకొనగా ఆదివారం నాడు జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొంది హనుమంతు షిండే గెలుపు పరంపరకు అడ్డుకట్ట వేశారు. హనుమంతు సిండే 2009 2014 2018 మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందుతూ వచ్చారు 2009 సంవత్సరంలో 34,124 ఓట్ల మెజార్టీతో గెల్పొందగా 2014 సంవత్సరంలో 35, 507 మెజార్టీతో గెలుపొందారు 2018 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 35,626 ఓట్ల మెజారిటీతో గెలుపొందుతూ వచ్చారు. ఇలాంటి భారీ మెజార్టీతో గెలుపొందుతూ వస్తున్న హనుమంతు షిండేకు జుక్కల్ ప్రజలు ఓడిస్తూ తోట లక్ష్మి కాంత్రావును గెలిపిస్తూ విజయాల పరంపరకు అడ్డుకట్ట వేశారు. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి హనుమంతు షిండే 77,584 ఓట్లు సాధించడం జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సౌధాగర్ గంగారాంకు 41,959 ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అరుణ తారకు 2018లో 18840 ఓట్లు వచ్చాయి 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి హనుమంతు షిండేకు 63 ,337 ఓట్లు సాధించగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తోటా లక్ష్మి కాంతారావు కు 64,489 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అరుణ తారకు గత ఎన్నికల్లో కంటే ఈ ఎన్నికల్లో పదివేల ఓట్లు అధికంగా సాధిస్తూ 28,437 ఓట్లు సాధించారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో  బీఆర్‌ఎస్‌ పార్టీ అభివృద్ధికి ప్రజలు ఓట్లు వేస్తారనే ధీమాతో ప్రజల ముందుకు వెళ్లగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ముఖ్యంగా ఆడపడుచులకు ఆదరించే విధంగా సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువస్తూ రాష్ట్రంలో మార్పు వస్తే బాగుంటుందని దాని పైన ప్రజల్లోకి వెళ్లారు ఇక బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ అభివృద్ధి పట్ల అదేవిధంగా రాష్ట్రంలో ప్రజా సంక్షేమం ఏ విధంగా ఉంటే బాగుంటుందని విషయాలపై మేనిఫెస్టో ద్వారా ముందుకు వెళ్లారు. కెసిఆర్ ఆయంలో జరిగిన పదేళ్ల కాలంలో ప్రజలు వ్యతిరేకిస్తూ ఇటు జుక్కల్లో గాని అటు రాష్ట్రంలో గాని మార్పు కోసం ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. జుక్కల్ నియోజకవర్గం లో అసెంబ్లీ ఎన్నికకు మొత్తం 17 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా పదిమంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు కాగా ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలబడ్డారు. 17 మంది పోటీ చేసిన ముగ్గురు మధ్యనే గెలుపు ఓటమిలపై జుక్కల్ ప్రజలు ఓట్లు వేశారు. చివరికి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు స్వల్ప మెజారిటీని అందించారు జుక్కల్ నియోజకవర్గం లో పోటీ చేసిన అభ్యర్థులు వారికి వచ్చిన ఓట్ల వివరాలు. ఈ కింద విధంగా ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి అరుణా తారకు 28,437 బీఎస్పీ ప్రజ్ఞా కుమార్ 1809 కాంగ్రెస్ పార్టీ లక్ష్మీకాంతరావు 64489 బీఆర్‌ఎస్‌  హనుమాన్ షిండే 63337 బహుజన్ ముక్తి పార్టీ కాశీనాథ్ 599 ఇండియా ప్రజాబంధు రాజు 162 బహుజన్ భారత్ పార్టీ బాబు 152 తెలంగాణ రాజ్యసమితి సాయిలు 187 ధర్మ సమాజ్ పార్టీ భూమయ్య 200 నవరంగ్ కాంగ్రెస్ పార్టీ గంగాధర్ 511 స్వతంత్ర అభ్యర్థి అనిల్ కుమార్ 204 స్వతంత్ర అభ్యర్థి విట్టల్ 341 స్వతంత్ర అభ్యర్థి సంజీవ్ 965 స్వతంత్ర అభ్యర్థి ప్రకాష్ 780 స్వతంత్ర అభ్యర్థి ప్రేమ్ కుమార్ 396 స్వతంత్ర అభ్యర్థి లక్ష్మి 1038 ఈ విధంగా ఓట్లు పోలయ్యాయి.