ప్రజా సమస్యలు తీర్చిన హనుమంతు షిండే

 – కె మా ఊరు జనాలు గెలిపిస్తారు సర్పంచ్ రాజ్ కుమార్
నవతెలంగాణ- మద్నూర్: మద్నూర్ ఉమ్మడి మండలంలో నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలంలోని మాదన్ ఇప్పర్గా గ్రామ ప్రజలు అభివృద్ధి వైపే ఉన్నారని మా ఊరు సమస్యలు తీర్చిన హనుమంతు షిండే కె ఓట్లు వేసి గెలిపిస్తారని ఆ గ్రామ సర్పంచ్ రాజకుమార్ పటేల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార రథానికి ఆయన స్వాగతం పలుకుతూ గ్రామస్తులతో మన ఊరుకు కావలసిన అభివృద్ధి పనులు మంజూరు చేసిన నాయకునికే ఓటు వేసి గెలిపిద్దాం అని పిలుపునిచ్చారు.