ఘనంగా ములుగు ఎమ్మెల్యే సితక్క పుట్టినరోజు వేడుకలు

నవతెలంగాణ -తాడ్వాయి  
ములుగు ఎమ్మెల్యే సితక్క 51వ పుట్టినరోజు వేడుకలు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ఆధ్వర్యములో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మహిళా అధ్యక్షురాలు రేగ కళ్యాణి, శ్రేణులతో ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు రేగ కళ్యాణి లు మాట్లాడుతూ.. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవా చెయ్యడమే దేయంగా  ములుగు నియోజక వర్గ  అభివృద్ధికి కృషి చేస్తున్న మన ప్రియతమా నాయకురాలు ములుగు ఎమ్మెల్యే సీతక్క అని, కృషి, పట్టుదల, సేవా దృక్పథం, మానవత్వం ఉన్న గొప్ప నాయకురాలు సీతక్క అన్నారు. ఇలాంటి  పుట్టిన రోజులు మరెన్నో  జరుపుకోవాలని, భవిష్యత్తులో అత్యున్నత హోదాలు అందుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, గౌరవ మండల అధ్యక్షుడు జాలపు అనంతరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్,  వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్ర కోళ్ల తిరుపతి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పాక సాంబయ్య, మండల మహిళా అధ్యక్షురాలు కొర్నెబెల్లి నాగమణి, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు భూషబోయిన రవికుమార్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు, పిఎసిఎస్ డైరెక్టర్ ఆషాడపు మల్లన్న, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పీర్ల వెంకన్న, జిల్లా నాయకులు తండాల శ్రీను బెజ్జూర్ శ్రీనివాస్ నాగేశ్వరరావు నారాయణ వ్యాపా మోహన్రావు వైస్ చైర్మన్ లాలయ్య డైరెక్టర్లు రమేష్ యాదవ్, యానాల సిద్ది రెడ్డి, వావిలాల రాంబాబు, రాజేందర్ పాక రాజేందర్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, మహిళలు, మేధావులు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.