– బీజేపీ పట్టణ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్
నవతెలంగాణ- చండూరు: బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం జన సంగ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సోమ నరసింహ, కోమటి వీరేశం, జిల్లా అధికార ప్రతినిధి నకిరేకంటి లింగస్వామి గౌడ్, సముద్రాల వెంకటేశ్వర్లు , భూతరాజు శ్రీహరి, సోమ శంకర్, దోటి శివ , బొబ్బిలి శివ, కర్నాటి శ్రీను, దుస్స గణేష్, పల్లె గోని చంద్రమౌళి, సామ వెంకట్ రెడ్డి ,చనగాని వినోద్, సూర్యం, తోకల రవీందర్ తదితరులు పాల్గొన్నారు