నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి, ఇందల్ వాయి మండల కేంద్రలతో పాటు అన్ని గ్రామాలలో గురువారం ఈద్-ఉల్ -అద్హా ను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.గత కోన్ని రోజులుగా జల్లులు కురుస్తుండటంతో పండగ రోజు కూడా వర్షాలు వస్తాయని అనుకుని ఆయా గ్రామాలలోని మస్ జీద్ లలో ఏర్పాట్లు చేశారు.ఉదయం వెకువ జాము నుంచి వర్షం పడక పోవడం,ఎండ ఉండటం వల్లా గ్రామంలో పోరిమేర్లలో ఉన్న ఈద్గాల వద్దనే అయా గ్రామాల మస్ జీద్ కమిటీ సభ్యులు నమాజ్ కోసం ప్రత్యేక నమాజ్ చేశారు.హాఫిజ్ ఎం ఖురాన్,మౌల్వీలు ఈద్-ఉల్ అద్హా ను ఉద్దేశించి ఖూరన్ ను చదివి వినిపించారు. అనంతరం అల్లాహ్ తో దేశం, రాష్ట్రం, జిల్లా,మండలం, గ్రామాలలో ఉన్న ప్రజలు, సుఖసంతోషాలతో ఉండాలని,మంచి వ్యాపారం, వ్యవసాయ పంటలు పండి, అందరు కలిసి మిలిసి ఉండాలని అల్లాహ్ తో ప్రత్యేక దూవ చేసి వెడుకున్నరు. అనంతరం ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ అంటు ఆలింగనం చేసుకున్నారు. కులం మతం భేదం లేకుండా ఈద్ ముబారక్ చేప్పుకున్నారు. చిన్నరులు నూతన వస్త్రాలు ధరించి ఈద్గాల వద్ద తమ తండ్రులు,అన్న తమ్ముళ్ళ తో కలిసి పాల్గొన్నారు.తమ పూర్వికుల సమాధుల వద్ద కు వేళ్ళి వారిని స్మరించుకుని సమాధుల పై పులను ఉంచి నివాళులర్పించారు. ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చోరవ చుపి ఎవరికి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అయా గ్రామాల మస్ జీద్, ఈద్గా కమిటీ లో సభ్యులు,కో ఆప్షన్ సభ్యులు షేక్ హుస్సేన్, షేక్ నయీమ్, ఆయా పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.