సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం..

Happy with the Supreme Court verdict..నవతెలంగాణ – నవీపేట్
సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులు  మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి గురువారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకారం రమేష్ మాట్లాడుతూ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, ఎన్నో అణిచివేతలు, అడ్డంకులు, అవరోధాలను తట్టుకొని మాదిగ ఉప కులాలకు రావలసిన ఫలితాలను సుప్రీంకోర్టు తీర్పు ద్వారా సాధించడం మందకృష్ణ మాదిగ ఉద్యమ ఫలితమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కుమార్, ప్రసాద్, హరీష్, యాదగిరి, పోశెట్టి, లక్ష్మణ్, విజయ్, వినోద్, సతీష్, రవి తదితరులు పాల్గొన్నారు.