7వ బెటాలియన్ లో ‘హర్ ఘర్ ధ్యాన్’ కార్యక్రమం..

నవతెలంగాణ -డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ లో కమాండెంట్ యన్.వి సత్య శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో మంగళవారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా ట్రైనర్స్ రాజారాణి అగర్వాల్ బృందం “హర్ ఘర్ ధ్యాన్ (మెడిటేషన్)” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడిటేషన్, ప్రాణాయామమునకు సంబంధించిన తరగతులను నిర్వహించి, యోగా ఆసనాలను బెటాలియన్ సిబ్బందికి నేర్పించారు. అదే విధంగా మానసిక శారీరక ఆరోగ్య ప్రదాయిని అయినటువంటి యోగాను అనునిత్యం ప్రతి ఒక్కరు కూడా చేయాలని, యోగా వల్ల కలిగే లాభాలను వివరించారు, పోలీసు సిబ్బంది వారి యొక్క విధులలో తలమునకలై ఒత్తిడితో జీవితాన్ని గడుపుతున్న తరుణంలో వారికి యోగా తరగతులు ఈ మానసిక సమతుల్యాన్ని అందించడంలో ఎంతో దోహదపడుతుందని రాజరాణి పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్స్ యమ్. వెంకటేశ్వర్లు, కే. భాస్కర్ రావ్, సి. ఆంజనేయ రెడ్డి, ఆర్.ఐ.లు, ఆర్. ఎస్.ఐ లు, సిబ్బంది, వివిధ బెటాలియన్స్ కుచెందిన బిగిల్ కోర్సు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.