మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు

Harsh action against women– అడిషినల్‌ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్‌
నవతెలంగాణ-శంకర్‌పల్లి
చిన్నపిల్లలపై, మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అడిషనల్‌ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్‌ అన్నారు. మోకిలా ఇండస్‌ ఇంటర్‌నేషనల్‌ స్కూల్‌, ప్రాచింగ్‌ గ్లోబల్‌ స్కూల్‌ కొండకల్‌ గ్రామంలో సోమవారం నేరాల నియంత్రణ పై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్‌ మాట్లాడుతూ చిన్నపిల్లలపై జరుగు తున్న నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్టు చెప్పారు. అదేవిధంగా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడూ డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసుల సహాయం పొందాలన్నారు. నేటి హైటెక్‌ యుగంలో జరుగతున్న సైబర్‌ క్రైమ్‌ నేరాలపై విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. సైబర్‌ క్రైమ్‌కు గురైన బాధితులు తక్షణమే, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1930 నెంబర్‌కు కాల్‌ చేసి ఏ విధంగా ఫిర్యాదు చేయాలో అవగాహన కల్పించినట్టు చెప్పారు. షీ టీం గురించి, రోడ్డు ప్రమాదాల నివారణపై వెల్లడించారు. మైనర్లకు డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనాలు నడపడంతో జరిగే ప్రమాదాలపై వివరించినట్టు తెలిపారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న మోసాలపై, వాటి భారీన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలిపారు. అంతేకాకుండా డ్రగ్స్‌తో జరిగే పరిణామాలపైన అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులకు వచ్చే సమస్యలపై ప్రతి స్కూల్‌లో ఒక్క చైల్డ్‌ సేఫ్టీ క్లబ్‌ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ క్లబ్‌లో మెంబర్స్‌గా ఇద్దరు టీచర్స్‌, ఇద్దరు స్టూడెంట్స్‌, ఇద్దరు తల్లిదండ్రులు, ఇద్దరు పోలీస్‌ ఆఫీసర్లు కూడా ఉంటారని తెలిపారు. పైన తెలిపిన విషయాల్లో ఏ సమస్య ఎదురైనా ఆ సమస్యలపై లెటర్‌ రాసి, స్కూల్‌లో ఏర్పాటు చేసిన కంప్లయింట్‌ బాక్స్‌ వేయాలన్నారు. ఆ ఫిర్యాదులను క్లబ్‌ సభ్యులు ఆధ్వర్యంలో ఆ సమ స్యలు పరిష్కరించనున్నట్టు తెలిపారు. ఈ కార్య క్రమంలో ముఖ్య అతిథులుగా మొకీల పోలీస్‌ స్టేషన్‌ సీఐ పి.నరేష్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు సి. కోటేశ్వర్‌ రావు, కె.కృష్ణ, కానిస్టేబుళ్లు, పాల్గొన్నారు.