నవతెలంగాణ – కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో టీపీసీసీ ప్రతినిధి కోలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో అభి యాన్ యాత్ర 65వ రోజుకు చేరుకుంది. గురువారం జీడి మెట్ల 132 డివిజన్ పరిధిలోని హెచ్ ఏ ఎల్ రాఘవేంద్ర కాలనీ (ఎస్బిఐ బ్యాంక్) పరిధిలో జెండా ఎగరవేసి , దుర్గా ఎస్టేట్ , బ్యాంక్ కాలనీ, ఎం.ఎన్.రెడ్డి నగర్ (శివాలయ టెంపుల్) వరకు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కోలన్ హన్మంత్ రెడ్డి గడపగడపకు హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.