గ్లోబల్‌ సంస్థల సరసన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌

ముంబయి: గ్లోబల్‌ దిగ్గజ బ్యాంక్‌ ల సరసన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ చేర నుంది. హెచ్‌డిఎఫ్‌సిని విలీనం చేసు కున్న తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ అమెరికా, చైనాకు చెందిన దిగ్గజ బ్యాంకుల సరసన చేరనుందని రిపోర్ట్‌ లు వస్తోన్నాయి. జులై 1న వీటి విలీనం పూర్తి కానుంది. అనంతరం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ మార్కెట్‌ విలువ 172 బిలియన్‌ డాలర్లకు పెరగనుంది. దీంతో జెపి మోర్గాన్‌ ఛేజ్‌, ఇండిస్టీయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా తర్వాత స్థానంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ నిలువ నుంది. విలీనం అనంతరం 12 కోట్ల ఖాతాదారులతో అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించనుంది. బ్యాంకు శాఖల సంఖ్య 8,300కు, ఉద్యోగుల సంఖ్య 1.77 లక్షలుగా ఉండనుంది.