
గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిచ్ పల్లి మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ వద్ద తాము సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మురళి, గంగాధర్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారంగా వేతనాలు ఇవ్వాలని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీలలో 50వేల మందికి పైగా పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారని వీరిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తూ కపట ప్రేమను చూపిస్తు పంచాయతీ కార్మికులచే వెట్టి చాకిరి చేయిస్తూ వారి శ్రమను దోస్తునారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను దేవుళ్ళుగా కొలుస్తూ వాళ్ళ కాళ్ళని కడుగుతూ కపట ప్రేమని చూపిస్తున్నారన్నారు. కార్మికులకు సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తపరిచారు. గ్రామపంచాయతీ లో పని చేస్తున్న సిబ్బందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వేతనాలు ఇవ్వాలని,మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, ఒకవేళ కార్మికుడు మరణిస్తే మట్టి ఖర్చుల కింద కనీసం 30 వేల రూపాయలు దహన సంస్కారాలకు అందించాలని అన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబానికి 20 లక్షలు నష్ట పరిహారం అందించాలని పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని పంచాయితీ కార్మికులకు దళిత బంధు, డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు ఇకనైనా కార్మిక సంఘాల జేఏసీ నాయకులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు . లేనియెడల ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాజేందర్, బాబు, రమేష్, నాగరాజు, సాయిలు, రాజేశ్వర్, భూమయ్య, రవి ,సాయిలు, గంగాధర్,మహేష్, బాలు తో పాటు తదితరులు పాల్గొన్నారు.