పక్కా ప్లాన్ తో అమ్మాయిని హత్యా ప్రయత్నం చేశాడు

నిందితుడు జైల్లో ఉండగానే ఫైల్ చేసి జైలు నుండి వచ్చే ప్రసక్తే లేదు  సి పి సత్యనారాయణ

నవ తెలంగాణ- జక్రాన్ పల్లి:
పక్కా ప్లాన్ తో అమ్మాయిని హత్యా ప్రయత్నం చేశాడని నిందితుడు జైల్లో ఉండగానే ఫైల్ చేసి జైలు నుండి వచ్చే ప్రసక్తే లేదని సిపి సత్యనారాయణ శుక్రవారం అన్నారు. కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని. జక్రాన్ పల్లి మండల కేంద్రంలో తేజశ్రీకి న్యాయం చేయాలంటూ కులాలకు అతీతంగా మతాల అతితంగా గ్రామస్తులంతా అరుంధతి ఫంక్షన్ హాల్ నుంచి జాతీయ రహదారి 44 వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం జాతీయ రహదారి 44 పైన రాస్తారోకో నిర్వహించారు. రాస్తా రోకో వలన వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అనంతరం మహిళా సంఘాలు ప్రజా సంఘాలు గ్రామస్తులు బస్టాండ్ లో తేజశ్రీకి న్యాయం జరపాలంటూ ధర్నా నిర్వహించారు. ధర్నా శిబిరానికి సిపి సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ తేజశ్రీ చాలా మంచి అమ్మాయిని ప్రేమ పేరుతో అమ్మాయిని నమ్మబలికి పక్క ప్లాన్ తో మనసులో ఏదో పెట్టుకుని నిందితుడు హత్యాయత్నం చేశాడని పేర్కొన్నారు. ఎంత కఠినంగా శిక్షించాలో అంతా రెడీ చేశామని రేపు శనివారము నిందితుని అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. కుటుంబానికి ప్రభుత్వం ద్వారా రావలసిన అన్ని అందే విధంగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా నిందితుడిపై హత్యాయత్నం  ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పల్ సెక్షన్ల పైన కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. నిందితుడు జైల్లో ఉండగానే ఫైల్ చేసి జైలు నుండి వచ్చే ప్రసక్తే లేదని మహిళా సంఘాలను గ్రామస్తులను సముదాయించారు. ఈ కార్యక్రమంలో  సూపర్డెంట్, ఏసిపి, సిఐలు ఎస్ఐలు ఎంఆర్పిఎస్ నాయకులు పిడిఎస్యు నాయకులు బీఎస్పీ పార్టీ నాయకులు మహిళా సంఘాలు కుల సంఘాలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.