
అశ్వారావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మొద్దులు మడ గ్రామంలో శనివారం ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసారు. ఈ శిబిరంలో 38 మందికి సాధారణ, చిరు తరుణ వ్యాధులకు చికిత్స, మందులు అందజేసారు.వర్షాకాలం సాధారణంగా వచ్చే వ్యాధులపై అవగాహన కలిగించారు.ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారు.ఈ సర్వే లో ఇంటి లోపల గల నీటి వనరులలో గల దోమ లార్వా ను కనుగొని తొలగించారు. ఇలా వారంలో మంగళవారం, శుక్రవారం రెండు రోజులు డ్రై డే నిర్వహించడం వలన దోమల పెరుగుదలను నియంత్రించే వీలు కలుగుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాకాలం త్రాగు నీరు కలుషితం అవుతుంది కావున నీటిని కాచి చల్లార్చి తాగాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరరావు, హెచ్.ఇ.ఒ రాజు, ఆరోగ్య పర్యవేక్షకులు శ్రీనివాస్, ఆరోగ్య సహాయకులు విజయ్, సత్యనారాయణ, చెల్లెమ్మ, ఆశా కార్యకర్త సత్యవతి పాల్గొన్నారు.