కోర్టులో పని చేసే మహిళ సిబ్బందికి ఆరోగ్య శిబిరము

నవతెలంగాణ- కంటేశ్వర్: నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డిఎల్ఎస్ఎ చైర్మన్, నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత ఆధ్వర్యంలో కోర్టులో పనిచేసే మహిళా సిబ్బందికి ఆరోగ్య శిబిరం మంగళవారం నిర్వహించారు. నిజామాబాద్, జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ చైర్మన్ జిల్లా జడ్జి కుంచాల సునీత మాట్లాడుతూ.. మహిళలలో ప్రబలుతున్న క్యాన్సర్ నివారించడానికి, అరికట్టడానికి తగిన టెస్టులు చేయించుకోవాలని, నిర్ధారణ జరిగితే తొలి దశలోనే చికిత్సను అందించవచ్చునని సూచించారు. వారి కార్యాలయం పనిచేసే మహిళా ఉద్యోగుల కాన్సర్ స్క్రీనింగ్ పరిక్షలు నిర్వహించాలని, అడగానే ఈ ఆరోగ్య శిభిరం ఏర్పాటు చేసిన డాక్టర్.ప్రతిమ రాజ్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిజమాబాద్ ఆసుపత్రిరి సూపర్డెంట్ట్ డాక్టర్ ప్రతిమ రాజ్ మాట్లాడుతూ.. మహిళలలో ఎక్కువ శాతం క్యాన్సర్ మరణాలు ఉంటున్నాయని, వాటికి ప్రధాన కారణం అవగాహన లోపం అని, తొలి దశలోనే స్క్రీనింగ్ పరీక్షల ద్వారా గుర్తించి చికిత్స అందించడం వలన మరణాలను సంభవించకుండా ఆపగలమని, ప్రధానంగా సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ రెండు రకాలు. వీటి కొరకు పాప్ స్మీయర్, కాల్పోస్కోప్, క్రయోథెరపీ మరియు మమోగ్రాఫ్ లాంటి పరీక్షల ద్వారా క్యాన్సర్ ను గుర్తించవచ్చునని తెలియజేశారు. ఇకనైనా మహిళలు చైతన్యంతో ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా కోర్టులో పని చేసే మహిళా ఉద్యోగులకు అన్ని రకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని వారు ఒక్కొక్కరు ఒక 10 మంది మహిళలకు అవగాహన కల్పించి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా తెలియజేయమని వారిని కోరారు.ఈ కార్యక్రమంలో పురుషోత్తం, పద్మావతి కోర్ట్ సిబ్బంది , ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.