
తెలంగాణ యూనివర్సిటీ లని హెల్త్ సెంటర్ ను యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.హెల్త్ సెంటర్ కు వచ్చే విద్యార్థులకు కావలసిన టాబ్లెట్స్, సిరప్స్ అందుబాటులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఏఎన్ఎం సుజాతను ఆదేశించారు. యూనివర్సిటీ కి అందించే ఈ సౌకర్యాన్ని విద్యార్థులు ఉపయోగించుకొని రోగాల పాడిన పడకుండా జాగ్రత్త వహించాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి సూచించారు.
హెల్త్ సెంటర్, పరిసరాలతో పాటు పడక గదులను, బెడ్స్ ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచే విధంగా చూడాలని సూచించారు. హెల్త్ సెంటర్ లోని అత్యాధునిక పరిజ్ఞాన మిషన్లను వినియోగంలోకి తీసుకురావాలని, వాటిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ శుభ్రపరచాలని అటెండర్ లకు ఆదేశాలు ఇచ్చారు. ఫినాయిల్ని వాడి గదులను శుభ్రం చేయాలని హెల్త్ సెంటర్ ఏఎన్ఎం సుజాత కు అందేశించారు.