ఆరోగ్యమే మహాభాగ్యం..

– తిలక్ గార్డెన్ ను అభివృద్ధి చేసుకుందాం: వాకర్ అసోసియేషన్ ప్రతినిధులు
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లాలోని సీనియర్ సిటిజన్స్ తో పాటు వాకర్ అసోసియేషన్ ప్రతినిధులు ముక్తకంఠంతో ఏకమై ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ముందు సాగుతూ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో తమ జీవితాన్ని గడపాలని తిలక్ గార్డెన్ వాకర్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు.. శనివారం నగరంలోని తిలగార్డెన్ లో తిలక్ గార్డెన్ వాకర్ అసోసియేషన్ ప్రతినిధులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా నిజామాబాద్ నడి బొడ్డులో ఉన్న తిలక్ గార్డెన్ సీనియర్ సిటిజన్స్ లకు, వాకర్ అసోసియేషన్ సభ్యులకు ఎంతో ఉపయోగకరంగా మారిందని వారన్నారు. ఈ గార్డెన్ లో తలెత్తున చిన్న చిన్న సమస్యలను అధికార పార్టీ నాయకులతో పాటు జిల్లా అధికారుల ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించుకునే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారన్నారు. ముఖ్యంగా వయసు పైబడిన వారికి వాకింగ్ చేసిన వాకింగ్ చేసే సమయంలో రోడ్డు ఇరువైపులా ఉన్న గుంతలను సరిచేసి ఈ సిమెంట్ రోడ్డు తో పాటు ఇరువైపులా మొరం మట్టితో కూడిన రోడ్డును ఏర్పాటు చేయాలని వారు జిల్లా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు కోరడం జరుగుతుందని వారన్నారు.. అంతేకాకుండా వాకింగ్ చేస్తున్న సీనియర్ సిటిజన్ల సౌకర్యార్థం స్విమ్మింగ్ పూల్ తో పాటు అదనపు మినీ జిమ్ మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. ఈ తిలక్ గార్డెన్ లోనే స్విమ్మింగ్ పూల్ కు సరిపడా ప్రభుత్వ స్థలం ఉన్నందున తక్షణమే జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా తో పాటు మున్సిపల్ కమిషనర్ చిత్ర మిశ్రా స్పందించి వాకర్ అసోసియేషన్ సభ్యులకు సంబంధించిన చిన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని ఆశ భావం వ్యక్తం చేస్తున్నామన్నారు. అంతకుముందు తిల గార్డెన్ వాకర్ అసోసియేషన్ సభ్యులైన కొందరు స్వర్గవాసులైనందుకు వారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సమావేశంలో తిలక్ గార్డెన్ వాకర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అడ్వకేట్ తుల గంగాధర్, ఎడ్ల ధనరాజ్, ప్రతినిధులు కృష్ణయ్య, ఉమారుద్దీన్, అరిఫ్ఫోడ్డిన్, సుధాకర్ శివ ప్రసాద్, బాబురావు, చంద్ర రెడ్డి డాక్టర్ రంగారావు, డాక్టర్ బాపురెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ రావు, ముంతాజ్, అక్తర్ , రాజు, నాగోరావు.మోతి సెట్,, రమేష్ ,షేక్ సుల్తాన్, పూర్ణచంద్రరావు, గంగాధర్ రమేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.