– నాబార్డ్ ఏజీఏం చంద్రశేఖర్
నవతెలంగాణ-పెద్దవంగర
ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో చిరుధాన్యాలు ఎంతో దోహ దపడతాయని నాబార్డ్ ఏజీఏం చంద్రశేఖర్ అన్నారు. గురువా రం మండల కేంద్రంలో నాబార్డ్ సహకారంతో లక్ష్యం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మిల్లెట్స్ తయా రీ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎస్బీఐ మేనేజ ర్ కుమారస్వామి, లక్ష్యం స్వచ్ఛంద సంస్థ సీఈఓ లలితతో కలిసి మాట్లాడారు. మండలంలోని పెద్దవంగర, వడ్డెకొత్తపల్లి, చిట్యాల గ్రామాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు మిల్లెట్స్ తయారీ పై గతంలో శిక్షణ ఇచ్చారు. మిల్లెట్ తయారీకి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పించి, మహిళలకు ఉ పాధి కల్పిస్తామని చెప్పారు. పూర్వం చిరుధాన్యాల ఆహారాన్ని తీ సుకుని ఆరోగ్యవంతమైన జీవనం గడిపారని పేర్కొన్నారు. మ హిళలు మిల్లెట్ తయారితో పాటుగా, మార్కెటింగ్ అంశాలపై దృష్టి సారించి ఆర్థికంగా స్థిరపడాలన్నారు.ఈ కార్యక్రమంలో సీసీలు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.