27న కవిత పిటిషన్‌ విచారణ

– సుప్రీం ధర్మాసనం ముందుకు..
న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ ఈనెల 27న సుప్రీం కోర్టులో విచారణకు రానున్నది. సుప్రీంకోర్టు కాజ్‌ లిస్ట్‌లో కవిత పిటిషన్‌ ఉన్నది. మహిళల విచారణపై ఈడీకి తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంలో కవిత ఈనెల 15న పిటిషన్‌ దాఖలు చేశారు. కవిత పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ అజరు రస్తోగి, జస్టిస్‌ బేలా త్రివేదిల ధర్మాసనం విచారణ జరపనున్నది. కవిత పిటిషన్‌పై ఈనెల 24నే విచారిస్తా మంటూ మొదట తెలిపిన సీజేఐ ధర్మాసనం ఆ తరువాత 27 నాటికి మార్చింది.