వరదలతో విద్యుత్ శాఖకు అపార నష్టం

– మోహన్ రెడ్డి విద్యుత్ ప్రాజెక్టు డైరెక్టర్
నవతెలంగాణ- గోవిందరావుపేట
విద్యుత్ అధికారుల విస్తృత తనిఖీలు జూలై 26, 27 ,తేదీలలో ములుగు జిల్లాలో అత్యధిక వర్షపాతం 68 సెంటీమీటర్ల భారీ వర్షాలు కురవడం వలన  మండల వ్యాప్తంగా విద్యుత్ శాఖకు అపార నష్టం వాటిలిందని విద్యుత్ ప్రాజెక్టు డైరెక్టటర్ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం మండల వ్యాప్తంగా జరిగిన నష్టం పై ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో మోహన్ రెడ్డి మాట్లాడారు. మండలంలో వరదల వల్ల అత్యధిక నష్టం జరిగిందని, గుండ్ల వాగు ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాలు మాన్ తండా, కర్లపల్లి, లక్ష్మీపురం అమృతండా, మద్దులగూడెం, పాత నాగారం, టప్ప మంచ  , ప్రాజెక్ట్ నగర్, మోట్లగూడెం చివరి వరకు, 10 50 విద్యుత్ స్తంభాలు వాగులు పొంగి  పొర్లడంతో కొట్టుకుపోయినవని, రాఘవపట్నం పరిధిలో ఇప్పలగడ్డ,సోమల గడ్డ ,రంగాపూర్ 150 స్తంభాలు వాగులో కొట్టుకుపోయినవని  మండలంలో నే రెండు కోట్ల నష్టం జరిగిందని విద్యు త్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మోహన్ రెడ్డి  తెలిపినారు. పసర సబ్ స్టేషన్ పరిధిలోగల 33 కెవి కర్లపల్లి లైను పూర్తిగా దెబ్బతినీ విద్యుత్ మరమ్మతులు యుద్ధ ప్రాతిపదకన  24 గంటలనే పూర్తిచేసి ప్రజలకు విద్యుత్తు నిరంతరాయంగా అందే విధంగా చేశామని తెలిపారు ‌‌. ప్రస్తుతానికి నేటి వరకు 400 విద్యుత్ స్తంభాలను, మరియు 34 ట్రాన్స్ఫర్లను మరమ్మతులు చేశామని అన్నారు .పసర  నుండి మేడారం వెళ్ళే 33 కెవి లేను విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో, మరమ్మతులు వెంటనే చేపట్టి, 72 విద్యుత్ స్తంభాలను, 24 గంటలలో మరమతు పనులు చేపట్టడం జరిగిందని అన్నారు ‌. కరెంటు మేడారం కి ఇవ్వడం జరిగింద నీ అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫర్లు, మరమ్మత్తులు చేపట్టడానికి, 11 కాంట్రాక్టర్లకు సంబంధించిన 150 మంది సిబ్బందితో పని చేస్తున్నామని అన్నారు.జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో, జిల్లాకు అదనపు అధికారులను పర్యవేక్షించి, పనులు పూర్తి చేయాలి అని వెంటనే మరమ్మతుల  చేపట్టాలని, అధికారులు సీజీఎం కమర్షియల్ ఆఫీసర్ బికం సింగ్, సీఈ కనెక్షన్స్ కే ఎన్ గుంట, అధికారులు సర్వే నిర్వహించి వెంటనే మరమతుల పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డి ఈ నాగేశ్వరరావు, డి ఈ మరెడ్డి, డి ఈ కనెక్షన్స్ ఎం హరి ప్రసాద్, ఏడి కిరణ్, ఏ డి ఈ శైలేంద్ర కుమార్,.ఏ. ఈ ఎం దేవ్ సింగ్,  అనిల్ రెడ్డి, సబ్ ఇంజనీరింగ్ పసర పి సంపత్ కుమార్, లైన్స్పెక్టర్ డి రామచంద్రయ్య, లైన్మెన్లు సుధీర్ రెడ్డి, కమలాకర్, కుమారస్వామి, లైన్మెన్, రాజేష్, మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.