– కెవైసి నిబంధనల అమల్లో విఫలం
– ఆ సంస్థకు రూ.5.39 కోట్ల పెనాల్టీ : ఆర్‌బీఐ చర్యలు
ముంబయి: పేటియం పేమేం ట్స్ బ్యాంక్‌కు రిజర్బ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ షాక్ ఇచ్చింది. ఆర్‌బిఐ నిబంధనలను పాటించ డంలో పేటియం విఫలం కావడం తో ఆ సంస్థకు రూ.5.39 కోట్ల జరి మానా విధించింది. ఈ విషయమై ఆర్‌బీఐ ఓ ప్రకటన విడుదల చేయగా.. పేటీయం రెగ్యూలేటరీ సంస్థల ఫైలింగ్‌లో తెలిపింది. పేమెంట్స్ బ్యాంక్స్ లైసెన్సింగ్‌కు సంబంధించి ఆర్‌బీఐ మార్గదర్శకాలు, బ్యాంకుల సైబర్ సెక్యూరిటీ, ప్రేమ్‌వర్క్, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ భద్రతకు నిర్దేశించిన నిబంధనలను పాటించడంలో విఫలమయ్యిందని ఆర్‌బిఐ పేర్కొంది. ‘ఆర్‌బీఐ కెవైసి నిబంధనలు 2016’ గైడ్‌లైన్స్ అమలు చేయలేదని పేర్కొంది. తాము ఈ లోపాలను గుర్తించా మని వెల్లడించింది. యాంటీ మనీలాండ రింగ్ కోణంలో ప్రత్యేక పరిశీలన జరిపామని పేర్కొంది. ఆర్‌బిఐ గుర్తించిన ఆడిటర్లతో పేటీయం పేమెంట్ బ్యాంక్‌లో సమగ్ర సిస్టమ్ ఆడిట్ నిర్వహించామని వెల్లడించింది. ఈ క్రమంలోనే వ్యాపారులకు అందించే సర్వీసు అయినా పేఔట్ సర్వీసులకు సంబంధించి సంస్థ యజమానులను గుర్తించ డంలో పేటీయం పేమెంట్స్ బ్యాంక్ విఫలమైనట్లు తేలిందని తెలిపింది.
పేఔట్ లావాదేవీలకు సంబంధించి ఆయా సంస్థల రిస్క్ అంశాలను పర్యవేక్షణ చేయడంలోనూ విఫలమైందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. పేఅవుట్ సేవలు ఖాతాదారుల అడ్వాన్స్ ఖాతాల్లో ఎండ్ ఆఫ్ ది డే బ్యాలెన్స్‌కు సంబంధించి నిర్దేశించిన పరిమితిని పేటీయం పేమెంట్స్ బ్యాంక్ ఉల్లం ఘించినట్లు గుర్తించినట్లు ఆర్‌బిఐ పేర్కొంది. తాము గుర్తించిన ఉల్లంఘ నలపై ఎందుకు జరిమానా విధించకూడదో వివరణ ఇవ్వాలని పేటియం పేమెంట్స్ బ్యాంక్‌కు నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆ సంస్థ ఇచ్చిన రాత పూర్వక సమాధానంతో పాటుగా వ్యక్తిగత విచారణలోని సమాధానా లకు ఆర్‌బీఐ సంతృప్తి చెందినట్లు లేదని సమాచారం. నిబంధనలు ఉల్లంఘించ నందుకే ఈ జరిమానా వేసినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. దీంతో సాధారణ ఖాతాదారుల లావాదేవీలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. గురువారం బీఎస్‌ఈలో పేటీయం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్ ధర 1.47 శాతం పడిపోయి రూ.957.60 వద్ద ముగిసింది.