జోరుగా అక్రమ మొరం తవ్వకాలు..

– యథేచ్చగా కొనసాగుతున్నఅక్రమదందా..
– కన్నెత్తి చూడని  రెవెన్యూ అటవీశాఖ అధికారులు.  అదృశ్యమవుతున్న ప్రకృతి వనరులు
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలలోని అంజని గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన ఉన్న అటవీ భూముల్లో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్న ఇటు రెవెన్యూశాఖ అటు అటవీశాఖ అధికారులు కన్నెతి చూడకపోవడంతో అక్రమ మొరం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా అన్నచందంగా మారిందని చెప్పవచ్చు. పచ్చనదంతో కళకళలాడాల్సిన గుట్టలు కనుమరుగవుతున్నాయి,అనుమతులు లేకుండానే యథేచ్ఛగా మొరం తవ్వకాలు చేపడుతూ అటవీ సంపదను కొల్లగొడుతు అక్రమంగా మొరం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ దందాను అడ్డుకోవాల్సిన అధికారులే ఇక్కడి వైపు చూడక పోవడంతోఅలుసుగా తీసుకున్న కొంతమంది అక్రమదందా కు  తెరలేపుతు జేసీబీ హిటాచి వంటి పెద్ద యంత్రాలతో ట్రిప్పర్లు ట్రాక్టర్ సహాయంతో మొరం తవ్వకాలు చేపట్టి పరిసర ప్రాంతాలకు  తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూముల నుంచి కాని అటవీ ప్రాంతాల నుంచి కాని, చెరువుల నుంచి మొరం తవ్వకాలు చేయాలంటే తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాలి కాని ఇక్కడ అవేమి లేవు.మొరం తవ్వుతూ గుట్టల ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు.అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.మొరం తవ్వకాలతో అడవుల కళ తప్పడంతో పాటు పెద్దఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.అయితే ఈ తతగం కొంత మంది  ప్రజా ప్రతినిధులు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా  అక్రమ మొరం తవ్వకాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని పలువురు జనాలు ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు మొరం
అక్రమాలను అడ్డుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సిన స్థానిక అధికారులు తమ ప్రాంతంలో అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా మొరం తవ్వకాలు జరుపుతున్నా తమకేమి పట్టనట్లుగా వ్యవహారించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి మొరం అక్రమ రవాణాను నిలిపివేయించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అంతే కాకుండా అడవుల్లోకి మేకలను మేపడనికి వెళ్లిన్నపుడు వాటి ఆహారం కోసం ఏదో చిన్న చెట్లను నరుకుతె నానా హంగమలు చేసే అటవీశాఖ ఏకంగా గుట్టలను వారం రోజుల నుండి అక్రమ మొరం రవాణా జరుగుతున్న అవేమి చూసి చూడనట్లు ఉండటం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మొరం రవాణా ను అడ్డుకట్ట వేయాలని జనాలు కోరుతున్నారు.