– ప్రత్యేక చర్యలు చేపట్టిన మున్సిపల్ చైర్మన్
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
మూడు రోజులుగా ఎడ తెరుపులేకుండ హుస్నాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాలతో హుస్నాబాద్ లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పట్టణంలోని పలు దుకాణాలలోకి నీరు చేరుకుంది. దీంతో వాహనదారులు షాప్ ల యజమానులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లన్ని జలమయం కావడంతో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న మున్సిపల్ సిబ్బందితో కలిసి హుస్నాబాద్ పట్టణంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. హుస్నాబాద్ పట్టణంలో ఎల్లమ్మ చెరువు మత్తడిని, మెయిన్ రోడ్ లో గల దుకాణదారుల నివాసాలను, పట్టణంలోని వార్డులలో కూలిపోయిన ఇండ్లు, శిథిలమైన ఇండ్లను మున్సిపల్ చైర్మన్ పరిశీలించారు. భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు .శిథిలమైన ఇండ్లలో నివాసం ఉండకుండా హుస్నాబాద్ పురపాలక సంఘం హెల్ప్ లైన్ కు వివరాలు తెలిపినచో సిబ్బంది తమకు సహకారాలు అందిస్తారని అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ బాలుర పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అవసరమైన వారికి సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఐలేని అనిత రెడ్డి, కమిషనర్ రాజశేఖర్ , కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు, పురపాలక సంఘం సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.