
మండలంలో ఆదివారం నుంచి కురుస్తున్న వర్షాలతో పాటు మంగళవారం కురిసిన వర్షాలకు, వాగులు వంకలు పొంగిపొరడంతో చెరువుల్లోకి భారీగా నీరు చేరడంతో అలుగులు ప్రమాదకర స్థాయిలో పారుతున్నాయి. రామారెడ్డి గంగమ్మ వాగు, కన్నాపూర్ వాగు తీవ్రస్థాయిలో ప్రవహించాయి. గన్ పూర్ నుండి రెడ్డి పేట వచ్చే రోడ్డు వరద నీటితో పాక్షికంగా ధ్వంసం అయింది. సాయంత్రానికి వర్షం తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణ శాఖ మరో రెండు రోజులు వర్షాలు కురియను ఉన్నాయని హెచ్చరికలతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు సూచించారు.