పట్టణంలో జోరు వాన

నవతెలంగాణ-ఆర్మూర్ : అల్పపీడన ప్రభావంతో సోమవారం పట్టణంతో పాటు వివిధ గ్రామాలలో జోరుగా కురిసిన వానలతో జనజీవనం అతలాకుతలం అయింది. గత నెల రోజులుగా ముఖం చాటేసిన వర్షాలు ఆది, సోమవారం కురవడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేసినారు.. ఈ సమయంలో వర్షం పడటంతో పొట్ట దశలో ఉన్న సోయాబీన్, మొక్కజొన్న పంటలకు ఎంతో మేలు చేకూర్చింది. కాగా పట్టణంతో పాటు వివిధ గ్రామాలలో కుండ పోతా వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి రైల్వే గేట్ దగ్గర ఇళ్లల్లో నీళ్లు చేరినాయి. ఉదయం సాయంత్రం ఆకాశం మేఘామృతమై భారీ వర్షం తో దినసరి కూలీలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.