గోశాల నుండి గోవదకు తరలిస్తున్న కోడెదూడలు..

– అడ్డుకున్న ఊర్కొండపేట గ్రామస్థులు.
నవతెలంగాణ – ఊరుకొండ 
నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఉరుకొండ పేట శివారులోని గోశాల నుండి సుమారు 40 కోడెదూడలు గోవధకు (కబేళాలకు) తరలిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఊరుకొండ పేట గ్రామ ప్రజలు అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. గతంలో కూడా ఎన్నో పశువులను గోశాల నుండి కబేళాలకు తరలించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోశాల నుండి కోడె దూడలను జకినాలపల్లి ఇప్పపాడు గ్రామ సమీపాల వరకు కాలినడకన తరలించి చీకటి పడ్డాక ప్రైవేట్ వాహనాలలో కబేలాలకు తరలించి గోశాల యాజమాన్యం సొమ్ము చేసుకుంటున్నారని గ్రామ ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత శాఖ ఉన్నత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై స్థానిక ఎస్సై లెనిన్ ను వివరణ కోరగా.. గోశాలలో గోవులకు మేత సరిపోకపోవడంతో మేత కోసమే బొమ్మరాజు పల్లి గ్రామానికి పశువుల తరలించామని.. సంరక్షించుకునే రైతులకు కోడే దుడలను ఇస్తామని గోశాల యాజమాన్యం తెలిపినట్లు ఎస్సై వివరించారు.