
ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముదిరాజ్ కుటుంబానికి చేయూతనందించారు. మండలంలోని తాటికాయల గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో పెసరు రాజయ్య మృతి చెందారు. ఈ సందర్బంగా ఆదివారం మెపా బాద్యులు బాధిత కుటుంబానికి నగదుతోపాటు, 50కేజీలు(అర క్వింట), నెలకుసరిపడా నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్బంగా మృతుడి భార్య భాగ్యలక్ష్మి సహకారం అందించిన మెపా బాద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మెపా రాష్ట్ర, హనుమకొండ జిల్లా, కాజిపేట్ మండలం బాద్యులు సింగారపు రామకృష్ణ, కనుకుంట్ల రవి, అంబటి కుమార్, అమ్మగారి శ్యాం సుందర్, సింగారపు మహేష్ కుమార్, సాధినేని సదా శ్రీను, దువ్వ దిలీప్, స్థానిక ముదిరాజ్ కులపెద్దలు పెసరు బొందయ్య, రాజు, మునిగాల బాలరాజు, పెసరు మోహన్, లింగం, తదితరులు పాల్గొన్నారు.