పెరటి కోళ్ల పెంపకంతో అధిక లాభం..

– తాడ్వాయి పశువైద్యాధికారి విజయలక్ష్మి
– రైతులకు పెరటి కోళ్లు పంపిణీ
నవతెలంగాణ- తాడ్వాయి
పెరటి కోళ్లు తక్కువ ఖర్చుతో విస్తృతంగా పెంచి అధిక లాభాలు పొందవచ్చని తాడ్వాయి పశు వైద్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని బీరెల్లీ గ్రామానికి 6 యూనిట్లు, తాడ్వాయి కి 2 యూనిట్లు మొత్తం ఎనిమిది యూనిట్లు, ఒక్కొక్క యూనిట్కు 25 కోడి పిల్లలు చొప్పున మొత్తం 200 లు శ్రీనిధి కోళ్లను శుక్రవారం రైతుల కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌష్టికాహార లోపం నుంచి అధిగమించడానికి పెరటి కోళ్ల ద్వారా వచ్చే మాంసం, గుడ్లు ఉపయోగపడుతాయని వివరించారు. కోళ్లకు ప్రతీ మూడు నెలలకు ఒకసారి నట్టలనివారణ మందు వేయాలని సూచించారు. ప్రతీ 6 నెలలకు ఒకసారి టీకా మందును స్థానిక పశు వైద్యశాలలో తీసుకోవాలని సూచించారు. పెరటి కోళ్లతో అధిక లాభాలు పొందవచ్చు సూచించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ రాజు, అటెండర్ శ్రీనాథ్, రైతులు ప్రేమ్ కుమార్, సంతోష్, నరసయ్య, రోశయ్య తదితరులు పాల్గొన్నారు.