వర్షపు నీటితో నిండిన పాఠశాల ప్రాంగణం..

– మన ఊరు మన బడి కావడం విశేషం…
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పధకాల లో మన ఊరు మన బడి ఒకటి.ఈ పధకం ఉద్దేశ్యం గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలను సైతం పునరుద్ధరించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దడమే. ఇందుకు గాను నిధులు మంజూరు చేసారు.కొన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ చిత్రంలోని పాఠశాల మండల పరిధిలోని వినాయకపురం కాలనీ ఎం.పి.పి.ఎస్ భవన సముదాయం.మన ఊరు మన బడికి ఎంపికై అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసారు.పనులు పూర్తి అయి రేపో మాపో ప్రారంభానికి నోచుకోనుంది.కానీ ఏళ్ళ తరబడి వేధించే ఈ వర్షపు నీటి చేరికలు మాత్రం పరిష్కరించలేని దుస్థితి. శుక్రవారం ఉదయం కురిసిన కొద్దిపాటి వర్షానికే ఇలా ఈ పాఠశాల ప్రాంగణం నీటితో నిండిపోయింది. దీంతో విద్యార్ధులు ఈ బురద నీటి లో నుండే రాకపోకలు సాగించారు.