హిందూ ముస్లిం బాయి భాయి..

– దుర్గా మాత విగ్రహానికి ముస్లిం  యువకుడి విరాళం
నవతెలంగాణ- డిచ్ పల్లి:
నేటి సమాజం లో కులాలు లేవు, మతాలు లేవనీ మనుషులంతా ఒక్కటే నని  కొన్ని సంఘటనలు గుర్తు చేస్తున్నాయి. మనుషులంతా ఒక్కటని ప్రతి మనిషిలో మార్పు వస్తే  మత విద్వేషాలు, మత ఘర్షణలు తలెత్తవనీ  పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇందల్ వాయి మండలంలోని  నల్లవెల్లి గ్రామం లో మంగళవారం గ్రామ యువకులు కలిసి దుర్గా మాతా  విగ్రహాన్ని ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే విరాళాల  సేకరణ కార్యక్రమం లో బాగంగా నల్ల వెల్లి  గ్రామానికి చెందిన ముస్లిం  యువకుడు  మహమ్మద్ ఇబ్రహీం తన వంతు దుర్గా మాత కు విరాళం అందించి తన ఔదర్యాన్ని చాటు కున్నాడు. నవులంతా సమానమని  నిరూపించాడు.  మహమ్మద్ ఇబ్రహీం ను గ్రామ యువకులు అభినందించారు.ఈ కార్యక్రమంలో  భూసాని మహేష్,  పుదరి మనోహర్,  పుధరి రాజేందర్,  గంగాధర్,   మహేష్, చింతల పల్లి రమేష్, తిరుపతి, సృజన,  కిరణ్ తదితరులు ఉన్నారు.