నవతెలంగాణ – సిద్దిపేట
భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన కూడా, ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, సిద్దిపేట జిల్లాలోని పలు ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులను పాఠశాలకు పిలిపించుకుంటున్నారని టి పి టి ఎఫ్ బృందం గురువారం అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ నవీద్, అధ్యక్షులు కాచం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సిద్ధులు, యాకోబు మాట్లాడుతూ.. ఈ విషయమై యాజమాన్యాలను టి పి టి ఎఫ్ బృందం అడుగగా, మీరు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి, మేము ఇలాగే నడిపిస్తామని దురుసుగా సమాధానం చెబుతున్నారని, ఇలా భారీ వర్షాలలో కూడా ప్రైవేటు టీచర్లను పాఠశాలకు పిలిపించుకొని ఇబ్బందులు పెడుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఆయా పాఠశాల యాజమాన్యాలకు ఆదేశాలు ఇస్తామని డీఈఓ తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి వివేక్ రెడ్డి, జిల్లా శాఖ సభ్యుడు షకీల్ పాల్గొన్నారు.