– మూడు క్రిమినల్ బిల్లుపై మూడు రోజుల చర్చ
న్యూఢిల్లీ : కేంద్ర హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మొదటి సమావేశం 24న జరగనున్నది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిజర్ (సీఆర్పీఎస్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వంటి చట్టాలను మార్చుతూ తీసుకొచ్చిన మూడు బిల్లులపై మూడు రోజులు చర్చ జరగనుంది. అయితే ప్రతిపక్ష ఎంపీలు దీన్ని వ్యతిరేకించారు. గురువారం మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజరు భల్లా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్యా (బీఎస్) బిల్లులపై ప్రజెంటేషన్లు ఇస్తారు. శనివారం మధ్యాహ్నం ముగుస్తుంది. ఆగస్టు 11న లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లులను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ పరిశీలన కోసం కమిటీకి సూచించారు. ఆగస్టు 18న ప్రజెంటేషన్ల షెడ్యూల్ గురించి ఎంపిలకు తెలియజేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.