నిజాయితీ చాటుకున్న రవీందర్ గౌడ్..

Honest Ravinder Goud..నవతెలంగాణ –  ఆర్మూర్  

పట్టణ ప్రాంతానికి చెందిన రవీందర్ గౌడ్ తన నిజాయితీని చాటుకున్నారు. పట్టణానికి చెందిన శ్రీనివాస్ పర్సును మామిడిపల్లి సమీపంలో పోగొట్టుకున్నారు. దొరికిన పర్సును రవీందర్ గౌడ్ స్థానిక పోలీసులకు అప్పజెప్పగా పోలీసులు వివరాలు సేకరించి బాధితుడిని పోలీస్ స్టేషన్కు పిలిపించారు.  పోలీసుల సమక్షంలో శ్రీనివాస్ కు పోగొట్టుకున్న తన పర్సును అప్పజెప్పారు. పర్స్ పోగొట్టుకున్న సమయంలో 5 వేల నగదు ఉందని శ్రీనివాస్ తెలిపారు. పట్టణ పోలీసులు శుక్రవారం రవిండర్ గౌడ్ ను అభినందించారు.