బదిలీపై వెళ్తున్న బ్యాంక్ అధికారులకు సన్మానం

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో కోపరేటివ్ బ్యాంక్ లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న బ్యాంక్ అధికారులు అసిస్టెంట్ మేనేజర్ రవీందర్ భిక్నూర్‌ బదిలీ కాగా, క్లార్క్ పురాం రాకేష్ మాచారెడ్డి కోపరేటివ్ బ్యాంకు బదిలీ అయిన సందర్భంగా సొసైటీ, బ్యాంక్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రాజా గౌడ్, కో-ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ రాజారెడ్డి, సొసైటీ సీఈఓ మోహన్ గౌడ్, బ్యాంక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.